: భిక్షగాళ్ల వేలి ముద్రలు తీసుకుంటున్న ఢిల్లీ పోలీసులు


చింపిరి జుట్టు, దుర్వాసన వచ్చే శరీరంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, రోడ్ల పక్కన అడుక్కునే బిచ్చగాళ్ల వేలిముద్రలను ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారు. భిక్షగాళ్ల వేలి ముద్రలు పోలీసులకు ఎందుకు అనుకుంటున్నారా? పగలంతా ఫ్లైఓవర్ల కింద, చెట్ల కింద, ఫుట్ పాత్ లపై కనిపించే వీరిలో కొందరు... రాత్రి కాగానే డ్యూటీ ఛేంజ్ అంటూ, దొంగతనాలు చేస్తున్నారట. ఇటీవలే రవి, కదమ్ అనే యాచక దంపతులు ఓ ఇంటి తలుపులు పగలగొట్టి రూ. లక్ష నగదు, బంగారం ఆభరణాలను దొంగిలించారట. దొంగతనానికి పాల్పడ్డవారు భిక్షగాళ్లు అని తేలడంతో... పోలీసులు కొత్త కార్యాచరణకు దిగారు. ఫుట్ పాత్ లు, ఫ్లైఓవర్ల కింద నివాసముండే 500 మంది భిక్షగాళ్లను ఢిల్లీలోని 16 పోలీస్ స్టేషన్లకు పిలిపించి, వారందరి వేలి ముద్రలను తీసుకున్నారు.

  • Loading...

More Telugu News