: దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సరసన నిలిచిన అశ్విన్


టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. ముంబైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. 43వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ ఇప్పటి వరకు ఈ ఫీట్ ను 23 సార్లు సాధించాడు. ఈ క్రమంలో భారత్ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సరసన అశ్విన్ చేరాడు. కపిల్ కూడా టెస్టుల్లో ఐదు వికెట్లను 23 సార్లు సాధించాడు. భారత బౌలర్లలో మరో ఇద్దు బౌలర్లు మాత్రమే ఈ విషయంలో అశ్విన్ కన్నా ముందున్నారు. అనిల్ కుంబ్లే ఇదే ఫీట్ ను 35 సార్లు సాధించగా, హర్భజన్ సింగ్ 25 సార్లు సాధించాడు. మరోవైపు, ఈ సిరీస్ లో అశ్విన్ ఇప్పటికే 20 వికెట్లను పడగొట్టాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో 891 పాయింట్లతో అశ్విన్ తొలి స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News