: జడేజా మాయాజాలం... దూరంగా వెళుతోందని వదిలేస్తే, వికెట్లను గిరాటేసిన బంతి!
ముంబైలో జరుగుతన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టెయిలెండర్లు క్రీజులో నిలబడటంలో విఫలమవుతున్నారు. ఓ వైపు బట్లర్ హాఫ్ సెంచరీ దిశగా సాగుతుంటే, అతనికి మరో ఎండ్ లో మద్దతిచ్చేవారు కరవయ్యారు. ఈ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది. ఓ వైపు నుంచి అశ్విన్, మరోవైపు నుంచి జడేజా ఇంగ్లండ్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో జడేజా వేసిన అద్భుత బంతికి రషీద్ అవుట్ అయ్యాడు. 112వ ఓవర్ ఆఖరి బంతిని జడేజా వేయగా, అది వికెట్లకు దూరంగా వెళుతోందని భావించిన రషీద్, దాన్ని వదిలేశాడు. అనూహ్యంగా టర్న్ అయిన ఈ బాల్ ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. దీంతో 4 పరుగులకే రషీద్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 114 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 340 పరుగులు. ప్రస్తుతం బుట్లర్ 48, బాల్ 0 పరుగులతో ఆడుతున్నారు.