: యజమాని దురాశ, వ్యవస్థలోని లోపాలు కలసి నిండు ప్రాణాలు బలిగొన్నాయి!: కేటీఆర్
భవన యజమాని సత్తూసింగ్ అలియాస్ సత్యనారాయణ సింగ్ దురాశ, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కలసి 13 మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టాయని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో గత రాత్రి కుప్పకూలిన ఏడంతస్తుల భవన బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం 180 గజాల స్థలంలో రెండంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఉంటే... దురాశతో ఏడంతస్తుల భవనం నిర్మించడం దారుణమని అన్నారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. ఇందులో ప్రభుత్వ విభాగాల వైఫల్యం కనిపిస్తోందని, బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.