: 'వేదనిలయం'లో 'మన్నార్ గుడి మాఫియా'... వాళ్లను జయలలిత రానీయలేదు, ఆమె పోగానే శశికళ స్వాగతం పలికారు!


మన్నార్ గుడి మాఫియా... శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాహరన్, ఇళవరసి, ఆమె కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మాధవన్, ఆమె మేనకోడలి భర్త శివకుమార్... తమిళనాట వీరందరినీ 'మన్నార్ గుడి మాఫియా' అని పిలుస్తారు. శశికళ సొంత ఊరైన తిరువూరు జిల్లా మన్నార్ గుడి పేరు మీద, ఆమె బంధువర్గాన్ని ఈ పేరుతో ఉదహరిస్తారు. ఈ మాఫియా ఇప్పుడు జయలలిత నివాసం వేదనిలయంలో చేరింది. జయలలిత గతంలో వీరిలో కొందరిని దగ్గర చేర్చుకున్నప్పటికీ, ఆపై జరిగిన పరిణామాలు, వీరి మనస్తత్వం తెలుసుకున్న ఆమె అందరినీ దూరం పెట్టింది. ఇప్పుడిక జయ మరణానంతరం, ఆమె నెచ్చెలి శశికళ, తన భర్త సహా బంధువర్గాన్నంతటినీ పోయిస్ గార్డెన్ లోకి అనుమతించింది. తనవారిని ఆమె పిలుచుకోవడం పట్ల అభ్యంతరాలు లేకున్నా, జయలలిత పక్కన పెట్టిన వారిని, గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వారిని ఇప్పుడు పక్కన పెట్టుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News