: మా కీలక రక్షణ భాగస్వామి ఇండియానే: అమెరికా ప్రకటన
భారత్ తమకు రక్షణ రంగంలో అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశమని అమెరికా అభివర్ణించింది. తన ఇండియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో సమావేశమైన అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ కార్టర్, మీడియాతో మాట్లాడుతూ, ఇరు దేశాలూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దిశగా మరింత సహాయ సహకారాలు అందించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. కార్టర్, పారికర్ ల మధ్య ఇది ఏడవ సమావేశం కాగా, ఇండియాతో మరిన్ని రక్షణ డీల్స్ కుదుర్చుకోనున్న సంకేతాలను ఆయన వెలువరించారు. భవిష్యత్తులో భారత అవసరాలు తీర్చేలా రెండు దేశాల మధ్యా పెండింగ్ లో ఉన్న పలు డీల్స్ ను ముందుకు తీసుకెళ్లే అంశంపైనా ఇరువురు నేతలూ చర్చించారు.