: 121,05,69,573.. ఈ సంఖ్య ఏంటో చెప్పుకోండి చూద్దాం..!?


భారత్ ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎంత వేగంగా ఎదుగుతోందో.. అంతకంటే వేగంగా జనాభా పెరిగిపోతోంది. అప్పుడెప్పుడో మనదేశ జనాభా వంద కోట్లు అంటే వామ్మో అనుకున్నాం. ఈ ఒరవడి అలా నిరాటంకంగా సాగిపోతూనే ఉంది. అందుకు నిదర్శనమే తాజా జనాభా గణాంకాలు. 2011 లెక్కల ప్రకారం భారత్ జనాభా 121 కోట్ల 5 లక్షల 69 వేల 573 వుందట. ఇందులో గ్రామీణ ప్రాంత జనాభానే అధికం. భారత జనాభాలో గ్రామీణులు 68.6 శాతం ఉండగా, పట్టణాలు, నగరాల్లో 31.2 శాతం జనాభా నివసిస్తున్నారు. అయితే, అక్షరాస్యత శాతం 70గా ఉండడం సంతోషించదగ్గ విషయం.

  • Loading...

More Telugu News