: సీఎంతో 'చేయి' కలిపిన కోమటిరెడ్డి!


సొంత పార్టీపైన, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మీద ఇటీవలి కాలంలో ఆరోపణలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజీ కొచ్చారా? ముఖ్యమంత్రి కిరణ్ తో 'చేయి' కలిపారా? ఈ రోజు జరిగిన సంఘటన 'అవును నిజమే' అనేలా ఉంది. 

ఈ ఉదయం కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు. కొంత సేపు మాట్లాడాక సీఎంతో కలిసి ఒకే వాహనంలో సచివాలయానికి వెళ్ళారు. వీరి వెంట ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉండడం విశేషం. ఇది కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యానికి గురి చేసింది. 

వాస్తవానికి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ ఆయనపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సొంత పార్టీ నేతలనే దునుమాడుతున్నారు. తెలంగాణ ఇవ్వకుంటే పార్టీని కూడా వీడతానని ప్రకటించారు. తెలంగాణ కోసమే మంత్రి పదవికి రాజీనామా చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ వైపు వెళతారని ఈయనపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి మాట్లాడడంతో అటు వెళతారేమో అన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి

ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కోమటి రెడ్డి ముఖ్యమంత్రిని కలవడం కొత్త ఊహాగానాలకు అవకాశమిచ్చింది.

  • Loading...

More Telugu News