: చైనాలో భూకంపం... రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదు
గత వారం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని వణికిస్తే, నిన్న అమెరికాలోని న్యూయార్క్ లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలోని వాయవ్య జిన్ జియాంగ్ లోని హుటుబీ కౌంటీలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి ఆరు కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే భూకంపం పట్టపగలు రావడంతో చైనీయులు అప్రమత్తమయ్యారని, ప్రాణనష్టం పెద్దగా సంభవించలేదని తెలుస్తోంది. మరీ తీవ్రమైన భూకంపం కాకపోవడంతో ఆస్తినష్టం కూడా సంభవించలేదని చైనా తెలిపింది.