: ఆర్కేనగర్ నుంచి శశికళ పోటీ?
అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టేందుకు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పోయెస్ గార్డెన్ ను తన అధికారిక నివాసంగా మార్చుకున్న శశికళ... ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా జయలలిత తరువాత తానేననే సందేశాన్ని తమిళనాడు ప్రజల్లోకి, రాజకీయ వర్గాల్లోకి స్పష్టమైన సందేశం పంపాలని గట్టి నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోయెస్ గార్డెన్ లో పార్టీ ముఖ్యనేతలతో ఆమె సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.