: కేసీఆర్ జీ.. పెద్దనోట్ల రద్దు ప్రభావం తెలంగాణలో ఎలా ఉంది?: అరుణ్ జైట్లీ ఆరా!


ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఈ సందర్భంగా 'కేసీఆర్ జీ.. పెద్దనోట్ల రద్దు ప్రభావం తెలంగాణలో ఎలా ఉంది?' అంటూ అరుణ్ జైట్లీ ఆరా తీశారు. నోట్ల రద్దు కారణంగా నెలకొన్న పరిస్థితులను కేసీఆర్ వివరించి చెప్పారు. అనంతరం, ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు రెండో దఫా నిధుల కింద ఇవ్వాల్సిన రూ.454 కోట్లు విడుదల చేయాలని జైట్లీని ముఖ్యమంత్రి కోరారు. అలాగే తెలంగాణలోని ఆర్థిక అంశాల గురించి జైట్లీకి వివరించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఆయన పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి రాసిన లేఖను కేసీఆర్ సమర్పించారు.

  • Loading...

More Telugu News