: జయలలితకు చికిత్స అందించిన అపోలోకు బాంబు బెదిరింపు


చెన్నైలో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 74 రోజులపాటు చికిత్సనందించిన అపోలో ఆసుపత్రికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అపోలో ఆసుపత్రిలో బాంబు పెట్టామని దుండగులు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబు స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు క్షణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, 74 రోజులపాటు చికిత్స అందించిన అపోలో సిబ్బంది అమ్మను కాపాడలేకపోయారని, అసలు ఆమెకు ఎలాంటి చికిత్స విధానం అందించారు? ఆమె ఎలా ఉన్నారు? అన్న విషయాలను కూడా తెలియనీయలేదని పేర్కొంటూ, జయలలిత అభిమానులు తీవ్ర ఆగ్రహంతో వున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడం విశేషం.

  • Loading...

More Telugu News