: లాభాల పంట పండించుకున్న స్టాక్ మార్కెట్లు
ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 457.41 పాయింట్లు లాభపడి 26,694.28 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 144.80 పాయింట్ల లాభంతో 8,246.85 పాయింట్ల వద్ద ముగిశాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్ (డి), టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, బాష్ తదితర షేర్లు లాభపడగా, భారతీ ఇన్ ఫ్రా టెల్, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు నష్టాలతో ముగిశాయి. కాగా, ఈసీబీ పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారం మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచింది.