: ధరమ్ జీ..హ్యాపీ బర్త్ డే!: అమితాబ్ బచ్చన్
ఈరోజు తన 82వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న నాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా బిగ్ బీ ట్వీట్ చేశారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన నాటి సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘షోలే’లో చిత్రీకరణ సందర్భంలో తీసిన ఫొటోలను అమితాబ్ పోస్ట్ చేశారు. కాగా, షోలే చిత్రంలో స్నేహితులుగా వీళ్లిద్దరూ కలసి నటించారు. జై పాత్రను అమితాబ్, వీరూ పాత్రను ధర్మేంద్ర పోషించారు.