: బెయిర్ స్టోను బోల్తా కొట్టించిన అశ్విన్... ఇంగ్లండ్ 255/5
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ రాణించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రెండు సెషన్లు ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ రాణించగా, చివరి సెషన్ లో టీమిండియా స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్ మన్ నిలకడగా ఆడి ఆకట్టుకున్నారు. జెన్నింగ్స్ (112) సెంచరీతో ఆకట్టుకోగా, మొయిన్ అలీ (50), కుక్ (46) కూడా రాణించారు. ఈ దశలో జూలు విదిల్చిన టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ను కట్టడి చేశారు. దూకుడుగా ఆడుతున్న కుక్ ను జడేజా పెవిలియన్ కు పంపగా, సెంచరీ, అర్ధ సెంచరీ హీరోలు జెన్నింగ్స్, మొయిన్ అలీ, రూట్, బెయిర్ స్టో (12)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో నాలుగు వికెట్లతో అశ్విన్ రాణించగా, ఒక వికెట్ తో జడేజా ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 81 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. క్రీజులో బెన్ స్టోక్స్ (13), బట్లర్ (1) ఉన్నారు.