: అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమన్న కిడ్నాపర్లు!


పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ డిజిటల్ మంత్రాన్ని జపిస్తున్నాయి. స్మార్ట్ చెల్లింపుల ద్వారా డబ్బులు తీసుకుంటూ వ్యాపార విస్తరణకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కిడ్నాపర్లు కూడా డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రస్థానం మొదలుపెట్టడం ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... నోయిడాలో పండ్ల వ్యాపారం చేసే మణి భూషణ్‌ అనే వ్యక్తి కుమారుడు విక్కీ (16) అక్టోబర్‌ 6 నుంచి కనిపించకుండాపోయాడు. దీంతో మానసిక వికలాంగుడైన తన కుమారుడు ఇంటిముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడంటూ మణి భూషణ్ అక్టోబర్‌ 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గత రెండు నెలలుగా కుటుంబ సభ్యులు, పోలీసులు విక్కీ కోసం వెతుకుతున్నారు. ఇంతలో అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. విక్కీ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, 50,000 రూపాయలు ఇస్తే వదిలేస్తామని చెబుతూ కిడ్నాపర్లు ఫోన్ లో డిమాండ్ చేశారు. అయితే, తన వద్ద అంతడబ్బు లేదని మణి భూషణ్‌ పేర్కొనడంతో, అయితే తమ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని పేర్కొంటూ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ అకౌంట్ మీరట్ కు చెందినదిగా గుర్తించారు. దీంతో ఒక టీం మీరట్ వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News