: 'మహారాజ్' హోదా పొందిన ముంబై రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు!
ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం, చారిత్రాత్మక సీఎస్టీ రైల్వేస్టేషన్ లకు 'మహారాజ' హోదా లభించనుంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఇకపై 'ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం'గా మారుతోంది. అలాగే... చారిత్రాత్మక రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ ను ఇకపై 'ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్'గా పిలుస్తారు. ఈ రెండు పేర్లను మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరాఠా వీరుడు శివాజీకి మరింత గౌరవం ఇవ్వాలనే భావనతోనే... ఛత్రపతి శివాజీ అని వదిలేకుండా మహారాజ్ ను కూడా తగిలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. మరో నెలలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.