: పెళ్లి విషయంలో కొంత క్లారిటీ ఇచ్చిన అనుష్క శర్మ!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కశర్మల ప్రేమాయణం కొన్ని నెలల నుంచి చర్చనీయాంశమే. వీరిద్దరూ ఇండియాలోనే కాదు, విదేశాల్లో సైతం చట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో... ఇక పెళ్లి మాత్రమే మిగిలింది అని అందరూ భావించారు. కానీ, ఇంతలోనే సీన్ రివర్స్. ఇద్దరూ బ్రేకప్ అయిపోయారని పెద్ద టాక్. ఈ బ్రేకప్ పై ఇద్దరు కూడా ఎక్కడా స్పందించకపోవడంతో... అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో, యువరాజ్ సింగ్ పెళ్లి, ఆ తర్వాత జరిగిన డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్ డే బాష్ లో కోహ్లీ, అనుష్కల జంట సందడి చేశారు. చుట్టూ వున్న ప్రపంచాన్ని మరిచిపోయి... ఈ జంట చేతిలో చేయి వేసుకుని నడిచారు. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి అనుష్క ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి మన చేతుల్లో లేదని... ఎప్పుడు జరగాలని రాసి పెట్టి ఉంటే అప్పుడే జరుగుతుందని ఈ ముద్దగుమ్మ చెప్పింది. తన జీవితంలో ప్రతి ఒక్కటీ దానంతట అదే జరుగుతూ వచ్చిందని... పెళ్లి టైమ్ వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుందని తెలిపింది. అయితే, తాను పెళ్లాడబోయేది కోహ్లీనే అనే విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేయలేదు.

  • Loading...

More Telugu News