: ట్రిపుల్ తలాక్ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే!: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు


మూడు సార్లు తలాక్ చెప్పి, భార్యకు విడాకులు ఇచ్చే సంప్రదాయంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాక్ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అని స్పష్టం చేసింది. ఇది ఆమోదయోగ్యం కాదని... దీన్ని ఎవరూ అనుసరించాల్సిన అవసరం లేదని చెప్పింది. ట్రిపుల్ తలాక్ అనేది మహిళల హక్కులను కాలరాయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి చట్టబద్ధత లేదని... దీన్ని ఎవరూ పాటించవద్దని చెప్పింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని... రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని తెలిపింది. మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం అనే ముస్లిం ఆచారంపై ఎంతో కాలంగా వాదనలు జరుగుతున్నాయి. ముస్లిం మహిళలు సైతం దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అయితే, ఇది తమ మతపరమైన ఆచారమని, ఇందులో వేలు పెట్టడం మంచిది కాదంటూ ముస్లిం మతపెద్దలు వాదిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ట్రిపుల్ తలాక్ పై ఓ స్పష్టత వచ్చినట్టైంది. మరోవైపు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News