: రాత్రి 7 దాటిన తర్వాత క్యాంపస్ లో అమ్మాయిలు ఉండరాదు... స్లీవ్ లెస్, షార్ట్స్ కూడా వేసుకోరాదు: ముంబై కాలేజీల ఆంక్షలు
తమ కాలేజీల్లో చదివే అమ్మాయిలపై ముంబైలోని కళాశాలలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఫ్యాషన్ల కోసం స్లీవ్ లెస్ డ్రస్సులు, షార్ట్స్, కత్తిరించుకున్న జీన్స్ ప్యాంట్లు వేసుకుని క్యాంపస్ లలోకి అడుగుపెట్టరాదంటూ స్ట్రిక్ట్ కండిషన్ పెట్టాయి. అంతేకాదు, కాలేజీ ఎంట్రన్స్ గేట్ల వద్ద నోటీసులు కూడా అతికించాయి. ప్రముఖ విద్యా సంస్థలు సెయింట్ జేవియర్, విల్సన్ కాలేజీలు కూడా ఈ నిబంధనలను విధించాయి. కొన్ని కాలేజీల్లో సమయానికి సంబంధించిన నిబంధనలను కూడా విధించారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత అమ్మాయిలు క్యాంపస్ లో కనిపించరాదని కొన్ని కాలేజీలు ఆంక్షలు విధించాయి. లైబ్రరీ, ల్యాబ్ లలో కూడా ఉండరాదని హెచ్చరించాయి. ఈ నిబంధనలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కత్తిరింపులు ఉన్న జీన్స్ ప్యాంట్ వేసుకుని వచ్చిన ఓ విద్యార్థినిని సెయింట్ జేవియర్ కాలేజ్ గేట్ వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.