: జయ అంత్యక్రియల్లో చిరునవ్వులు చిందించిన రాహుల్... మండిపడుతున్న నెటిజన్లు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు నిన్న చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు చైన్నైకి వచ్చి జయకు నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమ్మకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు. నివాళి అర్పించిన అనంతరం కూడా అక్కడున్న జనాలకు నవ్వుతూ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. మరోవైపు, రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ నవ్వుతూ మాట్లాడుతున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత్యక్రియల్లో నవ్వుతున్న రాహుల్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మ మరణంతో తమిళనాడు అంతా ఆవేదనలో మునిగిపోతే... అక్కడకు ఎందుకు వచ్చామో అనే సంగతిని కూడా మరిచిపోయి, నవ్వుకోవడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.