: ముంబై టెస్ట్: లంచ్ సమయానికి వికెట్ కోల్పోయి 117 పరుగులు చేసిన ఇంగ్లండ్


ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి ఒక్క వికెట్ కోల్పోయి 117 పరుగులు చేసింది. ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్ తొలి వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ కుక్ వన్డే స్టైల్లో ఆడి 60 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్ లో కుక్ స్టంపౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ జెన్నింగ్స్ 65 పరుగులతో (112 బంతులు) జాగ్రత్తగా ఆడుతున్నాడు. వన్ డౌన్లో బరిలోకి దిగిన రూట్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News