: గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? మోదీ సమాధానం చెప్పాలి: రాహుల్ డిమాండ్
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో నల్లధనం ఉన్న వారంతా బాగానే ఉన్నారని... సామాన్యులు మాత్రం ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని విమర్శించారు. బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారని... ఈ డబ్బు గాలికి ఎలా వచ్చిందో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల కుబేరులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో రాహుల్ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విమర్శలు గుప్పించారు. పేటీఎం అంటే 'పే టు మోదీ' అనే విధంగా మారిందని విమర్శించారు.