: ప్రభుత్వ నిర్ణయం సరైందే... నోట్ల సంక్షోభం కూడా నిజమే: జైట్లీ
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా కరెన్సీ సంక్షోభం నెలకొన్న సంగతి నిజమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒప్పుకున్నారు. ఢిల్లీలో జరిగిన పెట్రోటెక్-2016 సమావేశంలో మాట్లాడిన జైట్లీ... నవంబర్ 8వ తేదీన అమల్లోకి వచ్చిన నోట్లు రద్దు నిర్ణయం సరైనదే అని స్పష్టం చేశారు. దేశమంతా డిజిటలైజేషన్ వైపు అడుగులేస్తున్న ప్రస్తుత తరుణంలో... నగదు కొరత తప్పదని చెప్పారు. మీడియాతో పాటు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని... అయినప్పటికీ, చివరకు మంచే జరుగుతుందని తెలిపారు. బ్యాంకుల్లో ఆర్థిక నిల్వలు పెరగడం రానున్న రోజల్లో ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని జైట్లీ అన్నారు. దీర్ఘ కాలంలో మంచి ఫలితాలను అందుకుంటామని చెప్పారు. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రతి చిన్న లావాదేవీని సులభంగా నిర్వహించే వీలు కలుగుతుందని తెలిపారు.