: 10 సెల్ ఫోన్లను బాగానే నొక్కేశారు... పదకొండో సారి దొరికిపోయారు!
జయలలిత అంత్యక్రియలు జరుగుతున్న వేళ, అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వేళ, సురేష్, దినేష్ అనే ఇద్దరు తోడు దొంగలు రెచ్చిపోయారు. సెల్ ఫోన్లు, దొరికిన పర్సులు దొంగిలించడమే లక్ష్యంగా వచ్చి, రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ వరకూ అందిన చోట అందినంత నొక్కేశారు. ఈ ఇద్దరు తోడు దొంగలూ ఓ సెల్ ఫోన్ కొట్టేసే పనిలో ఉండగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిని విచారించిన పోలీసులే ఆశ్చర్యపోయారు. అప్పటికే 10 సెల్ ఫోన్లను వీరు కొట్టేశారు. ఆపై పలువురి వద్ద దొంగిలించిన రూ. 30 వేల నగదు కూడా వీరివద్ద లభించింది. జయలలితను చూసేందుకు వచ్చిన వారి నుంచి వీరు దోచుకున్నారని, చోరీ సొత్తును, సెల్ ఫోన్లను వాటి యజమానులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.