: నెల రోజుల బ్యాంకు ఉద్యోగుల కష్టానికి వరుస సెలవుల ఉపశమనం... ప్రజలకు మాత్రం తీర్చలేని ఇబ్బందే!


నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తరవాత ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో, దాదాపు అన్నే ఇబ్బందులను బ్యాంకు ఉద్యోగులూ ఎదుర్కొన్నారు. సెలవుల రద్దు, తీవ్రమైన పని ఒత్తిడికి తోడు క్యూలో నిలబడ్డ ప్రజల తిట్లు, శాపనార్థాలను భరిస్తూ, ఈ నెల రోజులూ తమ విధులు నిర్వర్తించారు. వచ్చే శనివారం నుంచి వీరికి వరసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. శనివారం నాడు సెకండ్ సాటర్ డే కాగా, ఆదివారం, ఆపై సోమవారం నాడు మిలాడినబీ కారణంగా బ్యాంకులకు సెలవు. ఇక మూడు రోజుల పాటు సెలవులు రానున్న కారణంగా నేడు బ్యాంకుల ముందు రద్దీ చాలా ఎక్కువగా ఉంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. ఈ రెండు రోజుల్లో బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో నగదు సరఫరా జరిగితేనే కొంత మేరకు ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.

  • Loading...

More Telugu News