: ఏపీవైపు దూసుకొస్తున్న 'వార్దా'... 11న తీరం దాటనున్న పెను తుపాను


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం... ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. నిన్న సాయంత్రం వరకు స్థిరంగా ఉన్న ఈ వాయుగుండం ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. విశాఖకు 1,160 కిమీ, మచిలీపట్నానికి 1,220 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. మరో 24 గంటల్లో (రేపటికి) ఇది పెను తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు వార్దా అనే పేరు పెట్టినట్టు చెప్పింది. ఈ నెల 11వ తేదీన మచిలీపట్నం-నెల్లూరుల మధ్య వార్దా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను పెను ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. గంటకు 130 నుంచి 140 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News