: రజనీ సరసన నటించే అవకాశాన్ని వదిలేసిన జయలలిత!


తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు రజనీకాంత్. వరుస హిట్లతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన తార జయలలిత. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే... అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ, రజనీ సరసన నటించేందుకు వచ్చిన అవకాశాన్ని జయ అప్పట్లో వద్దనుకున్నారట. ఇది జరిగేనాటికి జయ వయసు 32 ఏళ్లు. రజనీ అప్పటికే సూపర్ స్టార్ గా ఎదిగారు. రజనీ నటించిన బిల్లా సినిమాలో జయను చేయమని ఆ చిత్ర నిర్మాత బాలాజీ కోరారట. తాను ఆ ఆఫర్ ను తిరస్కరించిన తర్వాత... ఆ పాత్రకు శ్రీప్రియను ఎంపిక చేశారని పయస్ జీ అనే పాత్రికేయుడిని ఉద్దేశిస్తూ అప్పట్లో రాసిన లేఖలో జయ తెలిపారు. ఆ లేఖ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. అప్పటికే ఆమెకు సినిమాల మీద కొంచెం విరక్తి కలిగింది. ఇకపై సినిమాల్లో నటించాల్సిన అవసరం తనకు లేదని... మరోసారి సినిమాల్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నానా? అంటూ లేఖలో ఆమె ప్రశ్నించారు. ఒకవేళ ఆ సమయంలో జయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే... జయ, రజనీల కాంబినేషన్లో ఓ అద్భుత సినిమా అభిమానులను అలరించి ఉండేదనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News