: సెల్ ఫోన్లో నీళ్ళు పోస్తే సరి..!


'మీ సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందా? అందుబాటులో విద్యుత్ సౌకర్యం లేదా? అయితే, చింతించాల్సిన పనేమీలేదు. ఓ నీటి చుక్క మీ ఫోన్లో వేయండి, ఛార్జింగ్ ఓవర్' అంటున్నారు స్వీడిష్ శాస్త్రవేత్తలు. అయితే, ఇది ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్ చార్జెర్ విషయంలో కాదులెండి.. త్వరలో రానున్న కొత్త తరం బ్యాటరీ విషయంలోనే సుమా! తాజాగా స్వీడన్ కు చెందిన కొందరు పరిశోధకులు నీటి ఆధారిత సెల్ ఫోన్ ఛార్జర్ కు రూపకల్పన చేశారు. మైక్రో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ సాయంతో స్టాక్ హోమ్ కు చెందిన కేటీహెచ్ రాయల్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సాధారణ జలంతోనే ఈ నెక్ట్స్ జనరేషన్ ఛార్జర్ ను ఆవిష్కరించారు.

ఈ ఛార్జర్ సముద్ర జలంతోనూ పనిచేస్తుందని, అయితే ఆ నీరు పరిశుభ్రంగా ఉండాలని వారు అంటున్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఛార్జర్ ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ల్యాప్ టాప్ లకూ ఈ పరిజ్ఞానం ఉపయోపడే దిశగా ఇది తొలి అడుగు అని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News