: ‘టాటా గ్రూప్’ వివాదంపై మరోసారి స్పందించిన రతన్ టాటా
టాటా స్టీల్ యూరోప్ వ్యాపారంపై బోర్డు సభ్యులకు సైరస్ మిస్త్రీ లేఖ రాసిన నేపథ్యంలో ‘టాటా సన్స్’ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా మరోసారి స్పందించారు. సైరస్ మిస్త్రీపై ‘టాటా సన్స్’ బోర్డు విశ్వాసాన్ని కోల్పోయిందని, దానిని నడిపే శక్తి సామర్థ్యాలను ఆయన చూపలేదని వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్ నుంచి తప్పుకోవాలని మిస్త్రీని ముందే కోరామని, అయితే, అందుకు ఆయన అంగీకరించలేదని రతన్ టాటా అన్నారు.