: అవన్నీ వదంతులే..నమ్మకండి: బాలీవుడ్ నటి వాణీ కపూర్


అందంగా కనిపించేందుకు తాను ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నానంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, వాటిని నమ్మవద్దని బాలీవుడ్ నటి వాణీకపూర్ తన అభిమానులను కోరింది. గతంలో కంటే ఇప్పుడు తాను ఎంతో బరువు తగ్గానని, అందుకే, తన ముఖంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో మార్పును గమనిస్తున్నారని చెప్పింది. ‘బేఫికర్’ షూటింగ్ నిమిత్తం పారిస్ వెళ్లామని, అక్కడి వాతావరణం చాలా బాగుంటుందని, తన గ్లామర్ కు అది కూడా హెల్ప్ చేసిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్లు ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా వారిని విమర్శించడం తనకు ఇష్టం ఉండదని చెప్పింది. కాగా, రణ్ వీర్ సింగ్ సరసన వాణీ కపూర్ నటించిన ‘బేఫికర్’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News