: రహానే, మహ్మద్ షమీ అవుట్.. మనీష్ పాండే, శార్థుల్ ఠాకూర్ ఇన్!


రేపటి నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభం కానున్న నాలుగో టెస్టు నుంచి టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే వైదొలిగాడు. వాంఖడేలో ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డ రహానేకు విశ్రాంతినిస్తూ జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సొంత మైదానంలో ఆడే అవకాశాన్ని రహానే కోల్పోయాడు. అతని స్థానంలో కర్ణాటక రంజీ జట్టు ఓపెనర్ మనీష్ పాండేకు జట్టులో స్థానం కల్పించారు. అలాగే సీనియర్ బౌలర్ మహ్మద్ షమీకి కూడా విశ్రాంతినివ్వాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో శార్థుల్ ఠాకూర్ కు కూడా జట్టులో స్థానం కల్పించారు.

  • Loading...

More Telugu News