: 'అమ్మ' సమాధిని దర్శించుకున్న 'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంటోనీ


దివంగత జయలలిత సమాధికి సందర్శకులు తాకిడి పెరిగిపోతోంది. తమిళులు అమ్మగా భావించే సెల్వి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనాలని భావించి నిరాశ చెందిన ఎంతో మంది నేడు ఆమె సమాధిని దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించి, పుష్పగుచ్ఛాలతో నివాళులర్పిస్తున్నారు. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు నాట అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ కూడా జయలలిత సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఉంచి ఆమెకు నివాళులర్పించారు. అనంతరం అన్నాడీఎంకేకు చెందిన పలువురు నేతలు ఆమె సమాధిని సందర్శించారు.

  • Loading...

More Telugu News