: డ్యాన్స్ వేయించాలని ప్రయత్నించిన హీరోకి ఆసనాలతో షాకిచ్చిన రాందేవ్ బాబా
బాలీవుడ్ యువనటుడు రణ్ వీర్ సింగ్, రాందేవ్ బాబా మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 'బేఫిక్రే' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న రణ్ వీర్ సింగ్ ముంబైలో జరిగిన 'ఎజెండా ఆజ్ తక్' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి రాందేవ్ బాబా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబాను చూసిన రణ్ వీర్ సింగ్ తనతో పాటు డ్యాన్స్ చేయాలంటూ కోరాడు. తనకు డ్యాన్స్ రాదని రాందేవ్ బాబా చెప్పినా బలవంతం చేయడంతో తనకు తెలిసిన సూర్యనమస్కారం చేస్తానని, అలాగే నువ్వు కూడా చేయాలని రణ్ వీర్ సింగ్ కు సూచించారు. రణ్ వీర్ కూడా అంగీకరించడంతో బాబా తన విశ్వరూపం ప్రదర్శించారు. యోగాసనాలు వేసి అందర్నీ నిశ్చేష్టులను చేశారు. దీంతో తొలుత ఆసనాలు వేసేందుకు ఉత్సాహం చూపిన రణ్ వీర్ సింగ్, అ తర్వాత రాందేవ్ బాబా ఏ ఆధారం లేకుండా శీర్షాసనం వేయడంతో ఆయనకు దండంపెట్టేసి, అది తనవల్ల కాదన్నాడు.