: సెల‍్ఫీలతో కేటీఆర్.. సెల్ఫ్ డబ్బాలతో కేసీఆర్ బిజీ!: రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి కుర్చీలో ఆంధ్రాకు చెందిన చినజీయర్ స్వామిని తెలంగాణ సీఎం కూర్చోబెట్టడం రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన అమరవీరులను అవమానపర్చడమేనని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, ఓ వైపు కేటీఆర్ సెల‍్ఫీలతో కాలక్షేపం చేస్తోంటే, మరోవైపు సెల్ఫ్ డబ్బాలతో కేసీఆర్ బిజీగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం సమస్యలపై ప్రశ్నించిన వారిని అణచివేసే చర్యలకు దిగుతోందని అన్నారు. డబుల్ బెడ్ రూం పథకం అమలులో ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.