: జయపై పొగడ్తల వర్షం కురిపిస్తూ డీఎంకే బ్యానర్!


తమిళనాడులో రాజకీయ వైరం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గు మంటుంది. కానీ, జయలలిత మరణం తర్వాత డీఎంకే నేతలు, కార్యకర్తలు విభేదాలను పక్కనపెట్టి, అమ్మను మనస్పూర్తిగా కీర్తించారు. ఈ నేపథ్యంలో, జయకు అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ లో డీఎంకే శ్రేణులు ఓ బ్యానర్ ను ఏర్పాటు చేశాయి. అందులో జయ నిలువెత్తు ఫొటో, ఆమె గురించి తమిళంలో రాసిన వాక్యాలు ఉన్నాయి. "మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు లేరు. ఢీకొనేందుకు వేలాదిమంది ఉన్నా... వారిలో మీలాంటి యోధురాలు ఒకరైనా ఉన్నారా? ఎన్నికల రణరంగంలో మీరు నిలబడ్డప్పుడు మా చీఫ్ కరుణ, జనరల్ స్టాలిన్ లు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే, ప్రేమతో అందరి మనసులను మీరు గెలుచుకున్నారు" అంటూ ఫ్లెక్సీపై రాసి ఉంది. ఈ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు జయ మరణం పట్ల కరుణానిధి, స్టాలిన్ లు సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోని చేదు జ్ఞాపకాలను పక్కనబెట్టి, కొత్త బాటలో సాగుదామంటూ డీఎంకే ప్రకటించింది.

  • Loading...

More Telugu News