: జడేజా, కరుణ్ ల బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన సహచరులు
రేపటి నుంచి ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ కోసం భారత్-ఇంగ్లండ్ జట్లు ముంబై చేరుకున్నాయి. నేడు టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా (28), కరుణ్ నాయర్ (25) జన్మదినం కావడంతో హోటల్ కు చేరుకున్న అనంతరం జట్టు సహచరులతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీ, సహచరుల మధ్య బర్త్ డే బాయ్స్ జడేజా, కరుణ్ నాయర్ ఒకరినొకరు అభినందించుకుని, శుభాకాంక్షలు చెప్పుకుని కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకోగానే కేకులోని క్రీమ్ తీసి కరుణ్ నాయర్, జడేజా ముఖాలకు రవిచంద్రన్ అశ్విన్ పులిమేశాడు. దీంతో ఉమేష్ యాదవ్, ఇతర ఆటగాళ్లు కూడా అశ్విన్ ను అనుసరించారు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసింది.