: పక్కకు ఒరిగిపోయిన యుద్ధనౌకను పైకి లేపాలంటే మన టెక్నాలజీ సరిపోదట!


మరమ్మతుల అనంతరం ముంబయి డాక్ యార్డు నుంచి నీటిలోకి ప్రవేశిస్తున్న సమయంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ బెత్వా పక్కకు ఒరిగిపోయిన సంఘటన విదితమే. 3,850 టన్నుల బరువు, 126 మీటర్లు పొడవు గల బెత్వాను పైకి లేపి, యథాస్థితిలో ఉంచేలా చేయడం పెద్ద సమస్యగా పరిణమించింది. ఇంత బరువు గల బెత్వాను పైకిలేపి నిలబెట్టేందుకు స్వదేశీ టెక్నాలజీ సరిపోదని, విదేశీ నిపుణులు, పరికరాలు రావాల్సిందేనని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయని, రెండు రోజుల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ‘బెత్వా’ మెయిన్ మాస్ట్ పగిలిపోయింది. ఇంజన్ పూర్తిగా నీట మునగడమే కాకుండా, శత్రుదాడులను గుర్తించే సెన్సార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ‘బెత్వా’కు ప్రమాదం జరిగిన సమయంలో యుద్ధ నౌకలో పది శాతం ఆయుధాలు లోడ్ చేసి ఉన్నాయి.

  • Loading...

More Telugu News