: కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాలను మూడు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తాం: జగన్
తాము అధికారంలోకి వస్తే కేవలం మూడు నెలల కాలంలోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు. ఒక్క రెండేళ్లు ఓపిక పడితే చాలని... మీ కల నెరవేరుస్తానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు జగన్ వచ్చారు. ఈ సందర్భంగా బూరుగుపూడి గ్రామం వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లు జగన్ ను కలిశారు. ఏళ్ల తరబడి తాము ఉద్యోగం చేస్తున్నా... తమను రెగ్యులరైజ్ చేయడం లేదని జగన్ కు మొరపెట్టుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దీంతో, తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు.