: ‘వారి జీతాలు నిలిపేయండి’.. బీజేపీ పార్లమెంటరీ భేటీలో పలు కీలక సూచనలు చేసిన అద్వానీ
ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సభకు హాజరైన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పలు కీలక సూచనలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్లమెంటు ఉభయసభలను అడ్డుకుంటున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. సభలను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకుంటూ స్పీకర్, ఛైర్మన్ కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేదంటే సభలో చర్చలు సజావుగా జరిగేందుకు ఉన్న వేరే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోన్న సభ్యుల జీతాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంశాలను పరిశీలించాలని స్పీకర్ కు ఆ వేదిక ద్వారా సూచించారు.