: భారీ వంటశాల ‘మెగా అక్షయ్ పాత్ర’ నిర్మాణానికి శంకుస్థాపన
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో సంగారెడ్డి జిల్లా కందిలో 'మెగా అక్షయ్ పాత్ర' పేరిట నిర్మిస్తున్న భారీ వంటశాల నిర్మాణానికి మంత్రి హరీష్ రావు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘అక్షయపాత్ర’ నిర్మాణంలో సహకరించిన ‘ఇన్ఫోసిస్’ సంస్థను ఎన్నటికీ మరచిపోలేమని అన్నారు. మరెన్నో మంచి కార్యక్రమాలు సదరు సంస్థ ద్వారా జరగాలని తాను కోరుకుంటున్నానని హరీష్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సంస్థ చైర్ పర్సన్ సుధామూర్తి, ‘అక్షయపాత్ర’ చైర్మన్ మధుపండిత్ దాస పాల్గొన్నారు. కాగా, సుమారు 18.3 కోట్ల వ్యయంతో నాలుగున్నర ఎకరాల్లో ఈ వంటశాలను నిర్మించనున్నారు.