: ఆ న‌ల్ల‌ధ‌నంపై త‌ప్పుడు ప్ర‌చారం చేశారు.. జగన్ పై ఆరోపణలు చేశారు: బొత్స సత్యనారాయణ


ఐడీఎస్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ‌ లబ్ధికి వాడుకోవాల‌ని చూశారని, ఎవ‌రో ఆదాయ వివ‌రాలు ప్ర‌క‌టిస్తే దాన్ని త‌మ పార్టీకి అంట‌గ‌ట్టార‌ని వైసీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ప‌దివేల కోట్ల‌ రూపాయ‌లు ఎవ‌రు ప్ర‌క‌టించారో ఇప్పుడు వాస్త‌వాలు తెలిశాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... సీఎం, మంత్రులు బాధ్యత‌లు మ‌ర‌చి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఆ న‌ల్ల‌ధ‌నంపై త‌ప్పుడు ప్ర‌చారం చేశారని అన్నారు. ఐడీఎస్ పథకాన్ని ఓ జోక్‌లా మార్చేశార‌ని విమ‌ర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీకి ఆనాడే వైఎస్ జ‌గ‌న్ లేఖ రాశార‌ని, అందులో ఐడీఎస్ కింద వెల్లడించిన వివ‌రాల గురించి బ‌య‌టి వ్య‌క్తుల‌కు ఎలా తెలిసిందో చెప్పాలని అడిగార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. చంద్ర‌బాబు నాయుడు మోసం, ద‌గా, అవాస్తవాలతోనే ప్రజలను మ‌భ్యపెడుతున్నారని చెప్పారు. ఆ పది వేల కోట్ల రూపాయలు ఎవ‌రివో ఇప్పుడు తెలిసిపోయిందని అన్నారు. ఏ అంశం వ‌చ్చినా స‌రే దాన్ని రాజ‌కీయ కోణంలో ఆలోచిస్తూ, ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ ఏపీ ప్ర‌భుత్వ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశాన్ని కూడా చంద్ర‌బాబు నాయుడు ముందుగానే ప‌సిగ‌ట్టార‌ని, ఇలా జ‌రుగుతోంద‌ని ముందే తెలుసుకొని, న‌వంబ‌రు 8కి రెండు రోజుల ముందు హెరిటేజ్ షేర్ల‌ను అమ్మేశారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆ షేర్ల‌ను రెండు రోజుల ముందే ఎందుకు అమ్మాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారని ఆయ‌న అన్నారు. పెద్దనోట్లను రద్దు చేసే ముందు చంద్రబాబు నాయుడు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలంటూ వ్యాఖ్యలు చేశారని, పెద్దనోట్ల రద్దు గురించి ముందుగానే తెలుసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేశారని బొత్స ఆరోపించారు.

  • Loading...

More Telugu News