: 10 బ్యాంకులకు చెందిన 54 బ్రాంచ్ లపై ఈడీ దాడి!


దేశవ్యాప్తంగా 10 బ్యాంకులకు చెందిన 54 బ్రాంచ్ లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత బ్యాంకుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యాంకు సిబ్బంది కమిషన్ తీసుకుని పాత నోట్లను భారీ ఎత్తున మారుస్తున్నారు. ఈ క్రమంలో, పెద్ద మొతంలో డబ్బు బ్యాంకులకు వస్తున్నప్పటికీ, సామాన్యులకు మాత్రం అందుబాటులోకి రాకుండా పోతోంది. దీంతో, ఈ అంశంపై ఈడీ దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగా బ్యాంకులపై దాడి చేసి, తనిఖీలు నిర్వహిస్తోంది. డబ్బు రవాణా, మనీ లాండరింగ్ అంశాలపై కూడా ఆరా తీస్తోంది. ఈడీ దాడులు చేసిన బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయి. నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా డిపాజిట్లు చేసిన వారి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News