: ఎన్నో దేశాల మీడియాలో జయలలిత అంత్యక్రియలు... కవర్ చేశారిలా!


జయలలిత... తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ మరణించిన వ్యక్తి. ఆమె మృతి ఇండియా, ఇరుగు, పొరుగున ఉన్న శ్రీలంక వంటి దేశాల వరకూ ఫ్రంట్ పేజ్ న్యూస్. ఇక ఇంకాస్త దూరంలో తమిళులు అధికంగా ఉన్న మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు కూడా ప్రధాన వార్తే. కానీ, 11 కోట్ల మందికి 'అమ్మ'గా ఆమె తెచ్చుకున్న గుర్తింపు, పేదలకు అందించిన సంక్షేమ పథకాలు, ప్రపంచవ్యాప్తంగా జయలలితకు పేరు తెచ్చిపెట్టగా, ఆమె మరణాన్ని, అంత్యక్రియలనూ ఇంటర్నేషనల్ మీడియా ఆసక్తిగా కవర్ చేసింది. ఎన్నో దేశాల మీడియా ఆమె అంతిమయాత్ర చిత్రాలు ప్రచురించాయి. "తమిళనాడు నేత మరణంతో దక్షిణ భారతాన అధికార శూన్యత" అంటూ 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించింది. పేద ప్రజలకు దగ్గరైన, దీర్ఘకాల నేత నాటకీయ పరిణామాల మధ్య కన్నుమూశారని పేర్కొంది. ఆమె ప్రవేశపెట్టిన పథకాలను ఉటంకించింది. 'ది గార్డియన్' పత్రిక రచయిత వాసంతీ సుందరమ్ రాసిన జయలలిత జీవిత చరిత్రను ప్రస్తావిస్తూ, జయలలితను ఉక్కుమహిళగా అభివర్ణించింది. "పేరొందిన తమిళ ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత" అంటూ సింగపూర్ కేంద్రంగా వెలుడే 'ది స్ట్రెయిట్స్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇలా ఎన్నో దేశాల్లోని పత్రికలు జయలలిత మరణ వార్తలను కవర్ చేశాయి.

  • Loading...

More Telugu News