: ఇండోనేషియాలో భూక‌ంపం: 56కి చేరిన మృతుల సంఖ్య‌.. ఇంకా శిథిలాల కిందే పలువురు


ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ భారీ భూకంపం సంభవించిన సంగ‌తి తెలిసిందే. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 56కి పెరిగిందని అక్క‌డి అధికారులు చెప్పారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. అక్క‌డ‌కు చేరుకున్న రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. క్షతగాత్రుల్ని ఆసుప‌త్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తిన‌ష్టం కూడా జ‌రిగింది.

  • Loading...

More Telugu News