: ఉభయసభల్లో గందరగోళం.. 12 గంటల వరకు వాయిదా
పార్లమెంటు ఉభయసభల్లో విపక్షనేతలు పెద్దనోట్ల రద్దుపై ఈ రోజు కూడా గందరగోళం సృష్టించారు. చర్చకు సిద్ధంగానే ఉన్నామని అధికార పక్షసభ్యులు చెబుతున్నప్పటికీ నినాదాలు చేశారు. ఇష్టం ఉంటే చర్చను చేపట్టండి అంటూ బీజేపీ సభ్యులు కూడా రాజ్యసభలో నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. మరోవైపు లోక్‌సభలోనూ గందరగోళం నెలకొనడంతో సభను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.