: మోదీ సభకు వస్తూ, వెళుతూనే ఉన్నారు.. మీరు సభను అడ్డుకుంటూనే ఉన్నారు: అరుణ్‌జైట్లీ ఆగ్రహం
ఉభయసభల్లో విపక్షనేతలు పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారని, మోదీ సభకు వస్తున్నప్పటికీ విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఈ రోజు రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో కారణం చెబుతూ చర్చను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆయన అన్నారు. విపక్ష సభ్యులు సభను జరగకుండా అడ్డుకునేందుకు మాత్రమే చూస్తున్నారని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు సిద్ధమని చెప్పినప్పటికీ గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు చర్చకు సిద్ధంగానే ఉన్నామని, విపక్షాలు ధైర్యంగా చర్చకు రావాలని ఆయన పేర్కొన్నారు.