: దిగ్విజయం... పీఎస్ఎల్‌వీ సీ-36 ప్రయోగం సక్సెస్.. అందనున్న అత్యుత్తమ సేవలు


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీసీ-36 దిగ్విజయంగా ఉపగ్రహాన్ని కక్ష్య‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని ప‌ర్య‌వేక్షించిన‌ ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ శాస్త్ర‌వేత్త‌లంద‌రి కృషిని కొనియాడారు. 1235 కిలోల బ‌రువున్న‌ రిసోర్స్‌శాట్‌-2 ఏ ను 17 నిమిషాల్లో పీఎస్ఎల్‌వీసీ-36 క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింద‌ని శాస్త్రవేత్త‌లు తెలిపారు. రిసోర్స్‌శాట్‌-2ఏ జ‌ల‌వ‌న‌రులు, ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక, వ్య‌వ‌సాయ‌, ర‌క్ష‌క రంగాల‌కు ఐదేళ్ల‌పాటు అత్యుత్తమ సేవలు అందించనుందని తెలిపారు.

  • Loading...

More Telugu News