: ఫ్లాష్ బ్యాక్: చంద్రబాబు పరిస్థితిపై జయలలిత ఆందోళన... ఆనాడు ప్రత్యేక వైద్యులను పంపిన అమ్మ!
దాదాపు 12 సంవత్సరాల క్రితం... 2004... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలకు వెళ్లే నిమిత్తం బయలుదేరిన వేళ, అలిపిరి దాటగానే, నక్సలైట్లు మందుపాతరలు పేల్చి దాడి చేసిన సమయం.. కొన్ని గంటల పాటు అంతా అయోమయం. ఎవరి పరిస్థితి ఏంటో, చంద్రబాబెలా ఉన్నారో బయటకు స్పష్టంగా తెలియని సమయంలో, విషయం తెలుసుకున్న జయలలిత, చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనతో, తాను నమ్మే అపోలో అసుపత్రికి చెందిన వైద్యుల బృందాన్ని ప్రత్యేక విమానంలో తిరుపతి పంపారు. చెన్నైలోని రోడ్లను ఖాళీ చేయించి, వారిని ఎయిర్ పోర్టుకు పంపి, అక్కడి నుంచి వెంటనే రేణిగుంటకు బయలుదేరేలా చూశారు. అలిపిరిపై దాడికి కొంతకాలం ముందు, కోయంబత్తూరులో జరిగిన ఓ సభకు హాజరైన చంద్రబాబు, అక్కడి తెలుగువారందరినీ అన్నా డీఎంకేకు మద్దతివ్వాలని, జయలలితను గెలిపించాలని కోరారు.