: అలనాటి బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌కు తీవ్ర అస్వస్థత.. కొనసాగుతున్న చికిత్స
నిన్నటి తరం బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం 94వ పడిలోకి ప్రవేశించనున్న ఆయన కుడికాలు వాపు, తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దిలీప్ కుమార్ సతీమణి సైరాబాను తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, జన్మదినోత్సవానికి ముందే ఆయనను ఇంటికి తీసుకువెళ్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్నిసంవత్సరాలుగా దిలీప్ కుమార్ తరచూ అనారోగ్యం పాలవుతూ ఆస్పత్రిలో చేరుతున్న విషయం తెలిసిందే.